కల్తీ పాల ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య

కల్తీ పాల ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య

KKD: రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈ మేరకు చికిత్స పొందుతున్న రెడ్డి అనంతలక్ష్మి శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య అధికారి డా. కె.వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 14కి చేరినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె మృతి చెందినట్లు ఆసుపత్రి అధికారులు ప్రకటించారు.