BREAKING: 200 స్థానాల దిశగా NDA
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి దూసుకెళ్తోంది. 200 స్థానాల దిశగా హవా కొనసాగుతోంది. ప్రస్తుతం 191 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష మహాఘఠ్ బంధన్ కూటమి 49 స్థానాలకు పడిపోతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడింది. అలాగే, ప్రశాంత్ కిషోర్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.