గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
KMM: కామేపల్లి మండలంలోని పాతలింగాల పెద్దచెరువువాగులో గల్లంతైన బానోత్ శ్రీను (35) మృతదేహం లభ్యమైంది. గోవింద్రాలకు చెందిన శ్రీను పాతలింగాల పెద్ద చెరువు ఆయకట్టు కింద ఉన్న వాగులో చేపలు పట్టేందుకు వెళ్లగా కాలు జారి వాగులో గల్లంతయ్యాడు. ఈ నేపథ్యాన పోలీసులు గాలిస్తుండగా గోవింద్రాల బ్రిడ్జి సమీపాన పొలంలో ఆయన మృతదేహం శుక్రవారం లభించింది.