VIDEO: సీతారాముల స్వామివారు పల్లకిలో ఊరేగింపు
ELR: శ్రీరామనవమి సందర్భంగా ఉంగుటూరు గ్రామంలో శుక్రవారం సీతారాముల వారిని గ్రామంలో పల్లకిలో ఊరేగించారు. స్థానిక వంతెన వద్ద రామాలయం నుంచి ఊరేగించారు. పలువురు భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూజలు చేసి పల్లకి మోశారు. మండలంలో కైకరం, నారాయణపురం, చేబ్రోలు, బాదంపూడి, రాచూరు, రావులపర్రు, నల్లమాడు, పలు గ్రామాలలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి.