ఏరియా ఆసుపత్రిని సందర్శించిన సబ్ కలెక్టర్

PPM: పాలకొండ స్దానిక ఏరియా హాస్పిటల్‌లో సబ్ కలెక్టర్ పవర్ స్వష్నిల్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడుతూ వారికి వైద్య సేవలు సక్రమంగా అందుతున్నదీ లేనిది అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.