భవిష్యత్తులో సమ్మె తప్పదు: RTC JAC

TG: ఆర్టీసీ సిబ్బంది తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మంత్రితో చర్చల అనంతరం ఆర్టీసీ జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో తప్పకుండా సమ్మె చేసి తీరుతామని ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.