నేడు కాంగ్రెస్ పార్టీని వీడనున్న జీవన్ రెడ్డి

నేడు కాంగ్రెస్ పార్టీని వీడనున్న జీవన్ రెడ్డి

TG: మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. అనంతరం తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. అంతకుముందు జగిత్యాలలో కార్యకర్తలతో భేటీకానున్నారు. కాంగ్రెస్‌తో బంధానికి ముగింపు పలకాలని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వీడాక బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. జీవన్ రెడ్డితో కేటీఆర్ ఇప్పటికే సమావేశమైనట్లు తెలుస్తోంది.