VIDEO: చెరువు పొంగిపార్లింది.. రైతుల్లో ఆనందం
అన్నమయ్య: చిట్వేలు మండలంలోని ఎల్లమరాజు చెరువు భారీ వర్షాలకు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. తుఫాను ప్రభావంతో గత 4రోజులుగా వెలుగొండల పరిసర ప్రాంతాలలో పడిన వర్షపు నీటితో గుండాల కోన ద్వారా చెరువుకు వరద చేరింది. దాదాపు 480 ఎకరాల విస్తీర్ణం గల ఈ చెరువు కట్టలు దాటేంతగా నీటిమట్టం పెరగడంతో అలుగు ఉధృతంగా పారుతోంది. చెరువు నిండిపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.