కచ్చితత్వంతో జనగణనకు అధికారుల శిక్షణ

కచ్చితత్వంతో జనగణనకు అధికారుల శిక్షణ

BPT: చిన్నగంజాం మండలంలో జనగణనను సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో బుధవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. గ్రామాల్లో పని చేసే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు విధులు వివరించారు. సమాచారం ఖచ్చితంగా, పారదర్శకంగా నమోదు చేయాలని తహసీల్దార్ జె. ప్రభాకరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో ASO శివప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.