రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

MDK: నిజాంపేట మండల కేంద్రానికి చెందిన కొమ్మట రఘు (23) హైదరాబాద్ పట్టణానికి ఆరు నెలల క్రితం బతుకుదెరువు కోసం వెళ్లారు. బుధవారం ఉదయం దుండిగల్ చౌరస్తా వద్ద బైక్‌పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రఘు మృతిచెందాడు. రఘు మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.