విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన కలెక్టర్
GDWL: క్రీడలతో స్నేహ సోదర భావాలు పెంపొందుతాయని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. SGTU జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 14 వరకు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన TPL ప్రీమియర్ లీగ్ క్రికెట్ విజేతలకు మంగళవారం డీఈవో విజయలక్ష్మితో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. టీచర్లు మొదటిసారి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని సూచించారు.