ఇంటర్ విద్యార్థిని సూసైడ్

WGL: మనస్తాపం చెంది ఓ ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన కాజీపేటలో శుక్రవారం జరిగింది. ఎస్సై వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన విద్యార్థిని(18) హనుమకొండలో 2023-24లో ఇంటర్ చదివింది. పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో సప్లిమెంటరీ రాసింది. మళ్లీ తప్పడంతో మసస్తాపం చెంది ఒంటరిగా బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది.