సాదా బైనామాలకు లైన్ క్లియర్

సాదా బైనామాలకు లైన్ క్లియర్

TG: సాదా బైనామాలపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో రాష్ట్రంలో వాటికి లైన్ క్లియర్ అయింది. గతంలో BRS ప్రభుత్వం 2020 నవంబర్ 10 వరకు 9.5 లక్షల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించింది. కానీ, ROR చట్టంలో సాదా బైనామా అంశాన్ని చేర్చకపోవడంతో సమస్య ఏర్పడింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులలో 4 లక్షల దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు.