HYDలో చెత్త పాయింట్లు తొలగించటం సాధ్యమేనా..?
HYD: గ్రేటర్ HYD వ్యాప్తంగా మెగా శానిటేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపిన జీహెచ్ఎంసీ, GVP(గార్బేజి వల్నరబుల్ పాయింట్లను తొలగించడమే) లక్ష్యంగా చెప్పుకొచ్చింది. గత పది సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, GVP పాయింట్లు తాత్కాలిక ఉపశమనం లభించి, పరిస్థితి యధావిధిగా మారుతున్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు.