కోడిగుడ్డు, నిమ్మరసం ద్రావణం తయారీపై అవగాహన

W.G: యలమంచిలి మండలం గుంపర్రులో ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో కోడిగుడ్డు, నిమ్మరసం ద్రావణం తయారీపై అవగాహన శనివారం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి బాలత్రిపుర సుందరి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కోడి గుడ్డు, నిమ్మరసం ద్రావణం వరి పంటకి ఆరోగ్యంవంతమైందన్నారు. ఇందులో కావల్సిన ప్రోటీన్లు మొక్కకి అందజేస్తుందని చెప్పారు.