వైసీపీ నాయకులపై మంత్రి సంద్యారాణి ఫైర్

VZM: సాలూరు ఎమ్మెల్యే, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి వైసీపీ నాయకులపై ఫైర్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంపై వారు చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. కూటమి ప్రభుత్వానికి మైలేజ్ పెరుగుతుందనే భయంతోనే అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఉచిత బస్ పథకం చూసి ఓర్వలేక పోయారన్నారు.