వరంగల్ నగరంలో విచిత్ర వాతావరణం

WGL: వరంగల్ నగరంలో కొద్దిరోజులుగా విచిత్ర వాతావరణం నెలకొంది. ఏ రోజు ఎండలు మండిపోతున్నాయో, ఏరోజు వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. గురువారం ఉదయం నుంచి నగరంలో పూర్తిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. అయితే ఎండాకాలంలో ఈ అకాల వర్షాలతో తాము తీవ్రంగా నష్టపోతామంటూ రైతన్నలు వాపోతున్నారు.