కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించింది: వేమారెడ్డి

కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించింది: వేమారెడ్డి

GNTR: చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని మంగళగిరి వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి విమర్శించారు. మండలంలోని నూతక్కిలో సోమవారం సాయంత్రం 'బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ' కార్యక్రమం నిర్వహించారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.