మోపిదేవి స్వామివారి ఆదాయం రూ.9.63 లక్షలు

కృష్ణా: మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆదివారం ఒక్కరోజు రూ.9.63లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. సోమవారం మోపిదేవిలో ఆయన మాట్లాడుతూ.. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. నిత్యం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.