హాస్టల్లో కుక్కర్ పేలి మహిళకు గాయాలు
KMR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో ఇవాళ మధ్యాహ్నం ప్రెషర్ కుక్కర్ పేలింది. వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుక్కర్ పేలడంతో అందులో ఉన్న వేడి పప్పు లావణ్య అనే వంట చేసే మహిళ పై పడింది. లావణ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన సిబ్బంది అమెను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.