బోయకొండ హుండీకి భారీ ఆదాయం
CTR: చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టినట్టు ఈవో ఏకాంబరం తెలిపారు. 31 రోజులకు రూ. 35.33 లక్షల ఆదాయం వచ్చిందని ఆయన వెల్లడించారు. 10 గ్రాముల బంగారు, 136 గ్రాముల వెండి, వివిధ దేశాల కరెన్సీ హుండీలో లభించిందన్నారు. అలాగే, రణభేరి గంగమ్మ ఆలయంలో హుండీలో రూ. 22 వేల నగదు లభించిందన్నారు.