తెలంగాణ షూటర్‌కు మరో స్వర్ణం
టోక్యోలో జరుగుతున్న డెఫ్లింపిక్స్ 2025లో తెలంగాణకు చెందిన యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ మరోసారి స్వర్ణం సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్స్ ఈవెంట్‌లో పసిడి పతకం నిలబెట్టుకున్న ధనుష్.. తాజాగా మరోసారి 10 మీరటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ విభాగంలోనూ స్వర్ణ పతకం సాధించాడు. దీంతో డెఫ్లింపిక్స్ 2025లో రెండో గోల్డ్‌ను సొంతం చేసుకున్నాడు.