విశాఖలో CITU ర్యాలీ

విశాఖలో CITU ర్యాలీ

విశాఖపట్నంలో ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు CITU అఖిలభారత మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో CITU నాయకులు కార్మికులు ఆదివారం ర్యాలీ నిర్వహించి ప్రజలకు మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన, వ్యవసాయ, ఆటో కార్మిక సంఘాల నాయకులు, రైతు, ఐద్వా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.