ఓటు హక్కుతో ప్రజాస్వామ్యం బలోపేతం
MNCL: ఓటు హక్కుతో ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ఏసీపీ ప్రకాష్ సూచించారు. స్థానిక ఎన్నికల సందర్భంగా శనివారం లక్షెట్టిపేటలో పోలీసులు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్‌లో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్ 11న జరిగే ఎన్నికల్లో 18 సంవత్సరాలు దాటిన వారు ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణమూర్తి, ఎస్సైలు సురేష్, తహసుద్దీన్, గొల్లపల్లి అనూష పాల్గొన్నారు.