'ఒసేయ్ రాములమ్మ' నటుడు కన్నుమూత
MDCL: కాప్రా పరిధిలో ప్రథమపురి కాలనీలో నివాసముండే సీనియర్ సినీ నటులు కాలకోట రఘునాథరెడ్డి నిన్న రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. నెలక్రితం ఈయన కుమారుడు సైతం గుండె పోటుతో మరణించారు. రఘునాథరెడ్డికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. సుమారుగా 350కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. కలిసుందాం రా, ఒసేయ్ రాములమ్మ, ఇంద్ర, తమ్ముడు సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.