ఈతకు వెళ్లి పదవ తరగతి విద్యార్థి మృతి

ఈతకు వెళ్లి పదవ తరగతి విద్యార్థి మృతి

BHNG: ఈతకు వెళ్ళి 10వ తరగతి విద్యార్థి నీటిలో మునిగి మరణించిన ఘటన ఈరోజు భువనగిరి శివారులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. బాల ఆకాష్ అనే 10వ తరగతి విద్యార్థి భువనగిరి సమీపంలో స్వర్ణగిరి ఆలయం సమీప బావి వద్దకు ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ విద్యార్థి తెలంగాణ గురుకుల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.