తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేసిన కలెక్టర్

తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేసిన కలెక్టర్

JN: కొడకండ్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి,ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయంలో నిర్వహిస్తోన్న వివిధ సేవలు, దస్త్రాల నిర్వహణ,హాజరు పట్టికలు, తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. రికార్డుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.