'కుశాలపురం, తోటపాలెం పంచాయతీలుగా మార్చాలి'
SKLM: ఏపీ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు మర్యాదపూర్వకంగా మంగళవారం సాయంత్రం కలిశారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో విలీనమైన ఎచ్చెర్ల మండలానికి చెందిన కుశాల పురం, తోటపాలెం గ్రామాలను పంచాయతీలుగా మార్చాలి అని ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.