ఆసియా కప్‌లో టీమిండియా ఓపెనర్లు ఎవరు?

టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆసియా కప్‌లో భారత జట్టు ఓపెనింగ్ కాంబినేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్‌తో పాటు అభిషేక్ శర్మ వంటి ముగ్గురు స్పెషలిస్ట్ ఓపెనర్లు ఉన్నట్లు చెప్పాడు. అయితే, ఓపెనింగ్ జోడీపై UAE వెళ్లిన తర్వాత హెడ్ కోచ్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాడు.