పాఠశాలకు ల్యాబ్ పరికరాలు అందజేత
JGL: కథలాపూర్ మండలం దుంపేటలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు రూ. 2 లక్షల విలువ గల సైన్స్ ల్యాబ్ పరికరాలను మాజీ ఎంపీపీ రేవతి, మాజీ ఎంపీటీసీ మల్యాల రమేష్ అందించారు. ఎంపీటీసీ కోటాలోని అన్ టైడ్ నిధులు రూ. 2 లక్షలు వెచ్చించి ఈ పరికరాలు కొనుగోలు చేసినట్లు వారు పేర్కొన్నారు. విద్యార్థులకు సైన్స్ ల్యాబ్ పరికరాలు అందించినందుకు హెచ్ఎంలు సతీష్, పరమేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.