VIDEO: స్వామివారి సేవలో రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్
CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని శనివారం రాత్రి రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ రవీంద్రబాబు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు.