'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'

'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'

కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. కొత్తపేటలో పోలీస్ సిబ్బంది ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. వయస్సు నిండకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.