VIDEO: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భారీ అగ్నిప్రమాదం

VIDEO: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భారీ అగ్నిప్రమాదం

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సైకిల్ స్టాండ్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.