వరి కోత మిషన్‌లో యువకుడి కాలు నుజ్జునుజ్జు
SRD: నారాయణఖేడ్ మండలం సంజీరావుపేట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి వరి కోత కోస్తున్న యువకుడి కాలు హార్వెస్టర్ మిషన్‌లోపల పడి నుజ్జునుజ్జయింది. వెంటనే రైతులు గమనించి బాధితుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాలు తొలగించాల్సి ఉంటుందని వైద్యులు సూచించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు కేసు నమోదు చేశారు.