రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం

NZB: బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో ఈనెల 16వ తేదీ మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా నీటి సరఫరాను నిలిపి వేస్తున్నట్లు చెప్పారు. ఆయా ప్రాంతాల ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.