మోదీ మీటింగ్ లీక్‌పై కిషన్ రెడ్డి సీరియస్
ప్రధాని మోదీతో జరిగిన భేటీ వివరాలు లీక్ అవ్వడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు వెళ్లడంపై మండిపడ్డారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని, రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని మోదీ సూచించినట్లు చెప్పారు. క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.