జాబ్ క్యాలెండర్‌పై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

జాబ్ క్యాలెండర్‌పై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

VZM: ఉగాది సందర్భంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి స్పందించారు. మంత్రి లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారని అన్నారు. ఇందులో భాగంగా యువతకు ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సంతోషకరంగా ఉందన్నారు.