యాగంటి స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
NDL: బనగానపల్లె యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆయన సతీమణి కాటసాని జయమ్మ దంపతులు పర్యటించారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు.