ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ శిబిరం

NZB: మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో గురువారం ఎన్ఎస్ఎస్ శిబిరం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెలికం ఛైర్మన్ సతీష్ కుమార్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.7 రోజులపాటు ఈ శిబిరం కొనసాగుతుందని ప్రోగ్రాం ఆఫీసర్ మర్రిపల్లి భూపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రాజేశ్వర్, అధ్యాపకులు పాల్గొన్నారు.