'జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయండి'
VZM: జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని విజయనగరం కమిషనర్ పల్లి నల్లనయ్య కోరారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘానికి ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులను సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. యూనియన్ నాయకులు అంకితభావంతో పనిచేసి జిల్లాకు మంచిపేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.