విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

NZB: విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచిస్థాయికి చేరుకోవాలని ముదాక్‌పల్లి ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపల్ దేవిక అన్నారు. బుధవారం పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ..ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే ఉజ్వలమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.