ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు
WGL: వర్ధన్నపేట పట్టణంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు పాల్గొని ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం అందరికీ సుభిక్షం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.