'ప్లాస్టిక్ వినియోగంను నిరోధించాలి'
JGL: ప్లాస్టిక్ వినియోగంను నిరోధించాలని జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి రేవంత్ అన్నారు. మెట్‌పల్లి మండలంలోని చౌలమద్దిలో జిల్లా పంచాయతీ అధికారి రేవంత్ పర్యటించారు. గ్రామ పంచాయతీలోని పలు రికార్డులను, పల్లె ప్రకృతి వనాన్ని, డంపింగ్ యార్డును పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆయనను పలువురు శాలువతో సన్మానించారు.