ఆధునిక వ్యవసాయంతోనే అధిక దిగుబడులు: కలెక్టర్

ఆధునిక వ్యవసాయంతోనే అధిక దిగుబడులు: కలెక్టర్

SRD: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మంగళవారం గుమ్మడిదల మండలం నల్లవెల్లిలో 'వర్షాధారిత అభివృద్ధి పథకం' అమలును పరిశీలించారు. రైతు కూర్మ కొమురయ్య సాగు చేస్తున్న కూరగాయల తోటను సందర్శించి, పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు పాత పద్ధతులు వదిలి, ఆధునిక సాంకేతికత, రాయితీలను సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని ఆమె సూచించారు.