ధృవీకరణ పత్రాలు అందచేసిన విద్యాశాఖ అధికారి

ధృవీకరణ పత్రాలు అందచేసిన విద్యాశాఖ అధికారి

కోనసీమ: జిల్లాలో వృత్తి విద్య ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు వృత్తి విద్య శిక్షణలో బాగంగా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను పదిరోజుల పాటు ఎలక్ట్రానిక్, అగ్రికల్చర్, ఆటోమోటివ్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర వృత్తి సంస్థలలో నిర్వహించారు. విద్యార్థులందరూ ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ధృవీకరణ పత్రాలను  విద్యాశాఖ అధికారి డాక్టర్ సలీం భాష చేతుల మీదుగా స్వీకరించారు.