జిల్లా న్యాయాధికారికి సోమిరెడ్డి వినతి
నెల్లూరు: జిల్లా న్యాయాధికారికి సర్వేపల్లి MLA సోమిరెడ్డి వినతి పత్రం అందజేశారు. విదేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయని కాకాణి తప్పుడు పత్రాలు సృష్టించి అప్రతిష్ట పాలు చేశాడని, 2016లో కేసు పెట్టగా 2019లో చార్జిషీట్ వేశారని అన్నారు. అప్పటి నుంచి కేసు ముందుకు సాగలేదని, కేసును త్వరితగతిన పరిష్కరించాలని న్యాయాధికారి నాలుగవ అదనపు జ్యుడీషియల్ న్యాయాధికారిని కోరారు.