VIDEO: కంభంలో వడగళ్ల వాన

VIDEO: కంభంలో వడగళ్ల వాన

ప్రకాశం: కంభం పట్టణంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారి ఉరుములు, మెరుపులు వడగళ్లతో కూడిన వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి పట్టణంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదై అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో కొంతమేర ఉపశమనం పొందారు. ఉరుములు, మెరుపులు ఉండడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.