నేత్ర పదమంగా దేవాలయ వార్షికోత్సవం
MNCL: లక్షేట్టిపేట మండంలోని చందారం గ్రామంలో ప్రసన్నాంజనేయ సహిత సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం స్వామి వారి అభిషేకం, సుదర్శనహోమం, గజరోహణ కార్యక్రమాలను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. గురువారం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని దేవాలయ నిర్వాహకులు కోరారు.