నేడు బీహార్‌లో రెండో దశ పోలింగ్
రెండో దశ పోలింగ్‌కు బీహార్ సిద్ధమైంది. మొత్తం 122 అసెంబ్లీ స్థానాల్లో 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1.75 కోట్ల మంది మహిళలు. 45 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నాలుగు లక్షలకు పైగా సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు.