'శతాభీ రహదారిపై ఉన్న బండరాళ్లు తొలగించాలి'
PPM: పాచిపెంట మండలం వేటగానివలస - శతాభీ రహదారి మద్యలో ఇటీవల పడిన బారి వర్షాలకు రోడ్డుపై పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో గిరిజన గ్రామాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బండరాళ్లు ఉండటం వలన ద్విచక్రవాహనాలు తప్ప పెద్ద వాహనాలు వెళ్లడానికి వీలులేకుండా పోయిందని శతాభీ సర్పంచ్ శిల్పజన్ని రామయ్య తెలిపారు. అత్యవసర సమయంలో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.